1 00:00:08,000 --> 00:00:10,000 ఎర్రగా, రాళ్లతో కూడిన ఉపరితలం. 2 00:00:10,500 --> 00:00:13,400 అచ్చంగా కుజ గ్రహం మాదిరిగానే! 3 00:00:13,800 --> 00:00:17,500 ఇది, చిలీదేశంలోని అటకామా ఎడారి. 4 00:00:18,300 --> 00:00:19,600 పొడారిపోయి, 5 00:00:19,600 --> 00:00:21,000 శూన్యంగా, 6 00:00:21,000 --> 00:00:24,000 నిర్జీవంగా కనిపిస్తోంది. 7 00:00:24,000 --> 00:00:25,600 కాని, అంతటా అలా లేదు. 8 00:00:26,000 --> 00:00:32,000 నగరంలోని దీపాలకు సుదూరంగా 2600 మీటర్ల ఎత్తైన కొండమీద, 9 00:00:32,000 --> 00:00:40,000 ఈసోకు చెందిన వెరీ లార్జ్‌ టెలెస్కోప్‌ (విఎల్‌టీ)ఉంది. భూమిమీదనుంచి రాత్రిపూట ఆకాశాన్ని చాలా స్పష్టంగా చూపే టెలిస్కోపుల్లో ఇదే ఉత్తమమైంది. 10 00:00:41,600 --> 00:00:47,600 భారీ గుమ్మటాల్లో భద్రంగా నిర్మించిన ఈ టెలిస్కోపులను చూడండి. ఇటువంటి అతి శక్తివంతమైన, అత్యాధునిక టెలిస్కోపులు మరెక్కడా లేదు. 11 00:00:48,000 --> 00:00:54,000 ఈ టెలిస్కోపుల సహాయంతో, మన కంటితో చూసే తారలకన్న, 400కోట్ల రెట్లు తక్కువ కాంతిగల తారలను కూడ స్పష్టంగా చూడవచ్చు. 12 00:00:54,000 --> 00:01:01,000 వీటిద్వారా, మనం విశ్వాంతరాళాన్ని మునపటికన్న ఎక్కువ లోతుగా పరిశీలించగలం. 13 00:01:04,000 --> 00:01:07,000 ప్రకాశవంతంగా మెరుస్తున్న ఈ పట్టీయే పాలపుంత! 14 00:01:11,000 --> 00:01:20,000 మన సూర్యుడు, మన సౌరవ్యవస్థతోపాటు, లక్షలాది తారలకూ, ఇతర సౌరవ్యవస్థలకూ పుట్టిల్లు. 15 00:01:23,000 --> 00:01:28,000 ఇవివృశ్చిక ధనుర్‌ రాసులు. 16 00:01:30,000 --> 00:01:32,900 ఈ రెండూ రాత్రిపూట ఆకాశంలో సంచరించే 17 00:01:37,000 --> 00:01:41,900 88 తారాసముదాయాల్లోనివి. 18 00:02:09,000 --> 00:02:18,000 కంటికి కనిపించే వెలుగుతోను, ఇన్‌ఫ్రారెడ్‌ వెలుగుతోను పనిచేసే ఆధునిక టెలిస్కోపులు, దృష్టిని మసకబరిచే వాయు, ధూళి మేఘాలను చీల్చుకుని, 19 00:02:21,000 --> 00:02:25,000 మన గెలాక్సీ కేంద్రాన్ని చేరుకునే వీలు కల్పిస్తున్నాయి. 20 00:02:28,500 --> 00:02:37,000 వాయు, ధూళి మేఘాలతో నిండి ఉన్న పాలపుంత కేంద్రంలో, తారలు తిరుగుతూ కనిపిస్తాయి. 21 00:03:08,500 --> 00:03:17,000 గత 20 ఏళ్లుగా ఈ వెరీ లార్జ్‌ టెలిస్కోపు, కెక్‌ టెలిస్కోపుల సహాయంతో, వందకు పైగా తారల సంచారాన్ని శాస్రవేత్తలు గమనిస్తున్నారు. 22 00:03:20,000 --> 00:03:26,000 మన పాలపుంత గర్భంలో, అతి బలమైన శక్తి ఏదో ఉందని, ఆ తారలు మనకి తెలియచేసాయి. 23 00:03:26,500 --> 00:03:32,000 అదొక కృష్ణబిలం! మన సూర్యునికన్న 40లక్షల రెట్లు పెద్దది! 24 00:03:34,000 --> 00:03:37,600 ఈ కృష్ణబిలాల వాస్తవ స్వభావమేమిటన్నది, ఇంకా అంతు చిక్కని రహస్యంగానే ఉంది. 25 00:03:38,000 --> 00:03:44,800 చరిత్రలో మహా మహా శాస్త్రవేత్తలనే, అవి కంగు తినిపించాయి. కాల్పనిక విజ్ఞాన సాహిత్యానికి అభిమాన వస్తువులుగా నిలిచాయి. 26 00:03:45,000 --> 00:03:49,500 కృష్ణబిలాలు, తమ తోవకి అడ్డువచ్చిన దేనినైనా మింగేస్తాయి. 27 00:03:49,500 --> 00:03:57,500 మన గెలాక్సీలో ఆసక్తిదాయకమైన తారల్లో కొన్ని, ఈ కృష్ణబిలం గురుత్వాకర్షణ గుప్పెట్లో చిక్కుకుని ఉన్నాయి. 28 00:03:58,000 --> 00:04:03,000 ఐనా ఈ కృష్ణబిలం, తన చుట్టూ తిరిగే తారలతో సంతృప్తిచెందే రకంకాదు. 29 00:04:04,000 --> 00:04:08,500 మన భూమి కన్న ఎన్నోరెట్లు ఎక్కువ ద్రవ్యరాసి ఉన్న భారీ వాయు మేఘం ఒకటి, 30 00:04:08,500 --> 00:04:12,000 గంటకి 80లక్షల కి.మీ వేగంతో, కనపడని ఈ రాకాసివైపు దూసుకెళుతోంది. 31 00:04:12,000 --> 00:04:17,800 దాని కధ ముగిసినట్టే! 32 00:04:22,000 --> 00:04:29,800 పాలపుంత కేంద్రంలో ఉన్న తారలను అధ్యయనం చేయడంద్వారా, మనం దాని గర్భంలో అంతుపట్టని శక్తి ఏదో ఉందని కనుక్కోగలిగాం. 33 00:04:31,000 --> 00:04:33,900 కాని మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. 34 00:04:35,000 --> 00:04:44,000 కేంద్రం నుండి బయటకు వచ్చి చూస్తే, అత్యాధునిక ఇన్‌ఫ్రారెడ్‌ పరిశీలనలు, పాలపుంతలో విస్తారమైన ప్రాంతాన్ని ఆవిష్కరించాయి. 35 00:04:45,000 --> 00:04:52,000 మన వెరీ లార్జ్‌ టెలిస్కోపుకు పొరుగునే ఉన్న విస్టా, ప్రపంచంలోకెల్లా, అతి శక్తివంతమైన ఇన్‌ఫ్రారెడ్‌ సర్వే టెలిస్కోపు. 36 00:04:53,000 --> 00:04:57,000 దానికి మన దృక్పధాన్నే మార్చివేసే శక్తి ఉంది.... 37 00:04:59,000 --> 00:05:06,000 విస్టా చూపులోని తీక్షణతకి, ధూళిమేఘాల తెరకు తూట్లు పడ్డాయి. 38 00:05:07,000 --> 00:05:14,000 ఒకప్పుడు ఆకాశాన్నంతా ఆవరించివున్న నల్లని ధూళిమబ్బులు, ఇప్పుడు దాదాపుగా అదృశ్యమయ్యాయి. 39 00:05:16,000 --> 00:05:21,000 840 లక్షల తారలను చూపుతున్న ఈ ఇన్‌ఫ్రారెడ్‌ దృశ్యం మనకు లభించిన అతి పెద్ద ఖగోళదృశ్యాల్లో ఒకటి. 40 00:05:21,000 --> 00:05:24,000 అంటే 840 లక్షల తారలు, 41 00:05:25,000 --> 00:05:31,000 840 లక్షల అద్భుతాలను పరిష్కారంకోసం, ఎదురు చూస్తున్నాయి! 42 00:05:31,000 --> 00:05:35,700 అక్కడ గ్రహాలు, చంద్రులు, నీరు ఉన్నాయా? 43 00:05:36,500 --> 00:05:37,830 జీవం మాటేమిటి? 44 00:05:48,000 --> 00:05:51,700 పాలపుంతను మనం, మునపటికన్న లోతుగా అధ్యయనం చేసాం. 45 00:05:51,700 --> 00:05:57,100 ఎన్నో సమాధానాలు లభించాయి. కాని ఇంకా లక్షల సంఖ్యలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 46 00:06:00,000 --> 00:06:05,000 పాలపుంతలోని అద్భుతాలను ఆవిష్కరిస్తూ, వాటి మర్మాన్ని ఛేదిస్తూ, 47 00:06:05,500 --> 00:06:12,000 ఈసో టెలిస్కోపులు, తమ ఆకాశ శోధనా కార్యక్రమాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాయి. 48 00:06:21,090 --> 00:06:31,200 ఎసో ద్వారా లిప్యంతరీకరణ; అనువాదం ద్వారా -